వైద్య , పోలీసు సిబ్బందికి పూర్తి వేతనం..

April 2, 2020

వైద్య , పోలీసు సిబ్బందికి పూర్తి వేతనం..

• అదనపు నగదు ప్రోత్సాహకాలు
• వైద్యసేవల విస్తరణ : సత్వర వ్యాధి నిర్ధారణ

కరోనా వ్యాప్తిని నిరో ధించడానికి విశేషంగా కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య పోలీసు శాఖల సిబ్బందికి మార్చి నెలకు పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహకం ( ఇన్సెంటివ్ ) కూడా అందించాలని నిర్ణయించారు. ప్రోత్సాహకాన్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవ‌కాశం ఉంది.