హక్కు పత్రం పొందటానికి ఎలాంటి ఆధారాలుండాలి ?

March 26, 2020

హక్కు పత్రం పొందటానికి ఎలాంటి ఆధారాలుండాలి ?

అటవీ హక్కు పత్రం పొందాలంటే డిసెంబర్ 13 , 2005 నాటికి ఆ భూమి ఆక్రమణలో ఉన్నట్లు రుజువు చూపాలి . దీనికై ప్రభుత్వ డాక్యుమెంట్లు కానీ , ప్రభుత్వ రికార్డు ఏదైనా అంటే జనాభా లెక్కలు , గెజిటేర్లు , సర్వో , సెటిల్ మెంట్ రిపోర్టులు , మేప్‌లు , శాటిలైట్ మేప్‌లు , వర్కింగ్
ప్లానులు , అటవీ ఎంక్వైరీ రిపోర్టులు లాంటివి ఏమైనా ఆధారంగా చూపవచ్చు . ఇవే కాకుండా , రేషన్ కార్డు , వోటర్ ఐడెంటిటీ కార్డు , పాస్పోర్టు , ఇంటి పన్ను రసీదు , నివాస సర్టిఫికెట్ లాంటివి కూడా చూపవచ్చు . ఇళ్ళు , కోర్టు ఆర్డర్లు , సర్వే రిపోర్టులు , సంస్థానాలు ఇచ్చిన సర్టిఫికెట్లు , వంశవృక్షాలు , గ్రామ పెద్దల స్టేట్ మెంట్లు లాంటివి అన్నీ ఆధారాలుగా చూపవచ్చు .