డూప్లికేట్ పట్టాదార్ పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పొందే విధానం…..
భూమి హక్కు రికార్డును తయారుచేసి భూ యజమానుకు పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ జారీచేయడానికి 1971 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూమి రికార్డు మరియు పట్టాదారు పాసు పుస్తకా చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని అనుసరించి భూమి ఉన్న ప్రతి రైతుకు పీపీబీ, టీడీ ఇస్తారు. భూ యజమానికి ఈ పీపీబీ, టీడీ జారీ చేసేటప్పుడు చట్టంలోని నియమ నిబంధను అనుసరించి జారీచేస్తారు. అదేవిధంగా నకు కాపీ (డూప్లికేటు) పొందాన్న చట్టంలో కొన్ని నియమాలు ఉన్నాయి. పట్టాదారు పాసు పుస్తకానికి ఒక విధంగా, టైటిల్ డీడ్ నకలు పొందాలంటే మరో ప్రక్రియ ఉంది.
పట్టాదారు పాసు పుస్తకం నకలు (డూప్లికేటు) పొందాలంటే?
ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల రికార్డు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, 1971 మరియు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల రికార్డు మరియు పట్టాదారు పాసు పుస్తకాల నియమావళి 1989లోని రూలు 31 ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం పోయినవారు డూప్లికేటు కొరకు ఫొటో మరియు నిర్ణీత రుసుం చెల్లించి తహశీల్దారుకు అర్జీ పెట్టుకొనవలెను. తహశీల్దారు గారు 1బి రిజిష్టరులో డూప్లికేటు ఇచ్చినట్లు వ్రాసి డూప్లికేటు పాసు పుస్తకం మొదటి పేజీపై డూప్లికేటు అని వ్రాసి జారీచేస్తారు. ఒకవేళ చిరిగిన పట్టాదారు పాసు పుస్తకం స్థానంలో మరో పాసు పుస్తకం కోరేవారు చిరిగిన పుస్తకం తహశీల్దార్‌కు అప్పగించి డూప్లికేటు పాసు పుస్తకం పొందవచ్చు. చిరిగిపోయిన పాసు పుస్తకాన్ని పనికిరాకుండా చేస్తారు.
టైటిల్ డీడ్ నకు (డూప్లికేటు) పొందాంటే?
ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల రికార్డు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, 1971 మరియు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు రికార్డు మరియు పట్టాదారు పాసు పుస్తకాల నియమావళి 1989లోని రూలు 31(2) (ఎఫ్) ప్రకారం
(1) టైటిల్ డీడ్ పోయినవారు వెంటనే పోలీసు వారికి, రుణ సంస్థకు (బ్యాంకుకు) సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారికి వ్రాతపూర్వకంగా తొపుతూ పోయిన టైటిల్ డీడ్ ఆధారంగా ఏ చర్య తీసుకోరాదని కోరాలి.
(2) ప్రాంతీయ దినపత్రికలో టైటిల్ డీడ్ పోయినట్లు ప్రచురించవలెను. సదరు ప్రచురణ కాపీలు ఆర్.డి.వో గార్కి, సంబంధిత అధికారులకు పంపవలెను.
(3) ఒక సంవత్సరంపాటు ఎవరైనా ఇతర వ్యక్తి క్రెడిట్ ఏజన్సిల నుండి పోగొట్టుకున్న టైటిల్ డీడ్‌తో లోను పొందినట్లయితే తాను బాధ్యత వహిస్తానని ఇండెమినిటీ బాండు వ్రాసి ఇవ్వవలెను
.
(4) 100/` చెల్లించిన తర్వాత 1బి రిజిస్టరు నమోదుచేసిన తరువాత ఆర్.డి.ఒ. గారు డూప్లికేట్ టైటిల్ ఇస్తారు. దానిపై డూప్లికేట్ కాపీ అని కూడా వ్రాస్తారు.
(5) ఒకవేళ టైటిల్ డీడ్ చిరిగిపోయినట్లైతే దానిస్థానంలో ఆర్.డి.ఒ. గారు కలెక్టర్ గారి ఆమోదం పొంది, 100/` ఫీజు వసూలు చేసిన తర్వాత డూప్లికేట్ టైటిల్ డీడ్ ఇస్తారు. 1బి రిజిస్టర్‌లో డూప్లికేట్ టైటిల్ డీడ్ ఇచ్చినట్లు నమోదు చేస్తారు. తర్వాత చిరిగిపోయిన టైటిల్ డీడ్ పనికిరాకుండా చేస్తారు.