ఎంసేట్‌కు 1.18 లక్షల దరఖాస్తులు

March 20, 2020

ఎంసెట్కు 1.18 లక్షల దరఖాస్తులు
రాష్ట్రంలో మే 4వ తేదీ నుంచి 11 వరకు నిర్వహించనున్న ఎంసెట్ – 2020 కోసం గురువారం సాయంత్రం వరకు 1 , 18 , 114 దర ఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించామని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవరన్ తెలిపారు . ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 73 , 848 , అగ్రికల్చర్ , మెడికల్ విభాగంలో 44 , 266 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు . ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెల 30 వరకు గడువు విధించామని , ఆలస్య రుసుంతో ఏప్రిల్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు .