రామన్నగట్టులో రిజర్వాయర్
24 గ్రామాలకు నీరందేలా ప్రణాళిక
రామన్నగట్టులో నూతన రిజర్వాయర్ ఏర్పాటు చేసి రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు . వనపర్తి జిల్లా పానగల్ మండలం కిష్టాపూర్ సమీ పంలో రామన్నగట్టు రిజర్వాయర్ కోసం స్థలాన్ని పరిశీలిం చారు . రామన్న గట్టు రిజర్వాయర్‌తో దాదాపు మండలంలోని 24 గ్రామాల రైతులకు సాగునీరందుతుందని చెప్పారు . డీ – 8 కాల్వ ద్వా రా వచ్చే నీటిలో ఒక టీఎంసీ వరకు నీటిని నిల్వచేసుకునే అవకాశం ఉంటుందన్నారు . భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు . ఇంజినీ రింగ్ అధికారులతో సర్వే చేయించి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపు తామన్నారు . ప్రతిపాదిత స్థలంలో అటవీ భూములుంటే అనుమతులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు .