రెవెన్యూ శాఖ సేవలు అభినందనీయం:: జిల్లా కలెక్టర్ సీక్తా పట్నాయక్
కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ లో రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. విదేశాలనుండి, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని గుర్తించడం, వారిని గృహనిర్బంధం చేయడం, గృహ నిర్బంధంలో ఉండేలా పర్యవేక్షించడం లో రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్లు మంచి పాత్ర పోషించారని, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం కంటే స్థానికంగా రెవెన్యూ అధికారులు మరింత సమాచారం సేకరించి విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించడం లో కీలక పాత్ర పోషించారని, నిత్యావసర సరుకులు కొరత రాకుండా చర్యలు తీసుకోవడం సామాజిక దూరం పాటించేలా చర్యలు సంబంధించిన అంశాలలో తహసీల్దార్లు గ్రామ రెవెన్యూ అధికారులు రెవెన్యూ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది అని, జిల్లాలో వసతి గృహాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు చేయడం, విదేశీయులకు స్టాంపింగ్ పూర్తిచేయడం అం, లాక్ డౌన్ అమలు చేయడం వంటి పనులలో రెవెన్యూ సిబ్బంది మంచి సహకారం అందిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. జిల్లాలో 176 విదేశీయులని, 694 మంది ఇతర ప్రాంతాల వారిని గుర్తించి వారిని గృహనిర్బంధం చేయడంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకమైందని అన్నారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులు రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు , గ్రామ రెవెన్యూ అధికారులు రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది తో సమన్వయం చేసుకుంటూ వైరస్ కట్టడి చర్యలో భాగస్వామ్యం అవుతున్నారని, పారిశుధ్య నిర్వహణ వాణిజ్య సంస్థల పర్యవేక్షణ, ధరల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి పెద్దపెల్లి జారీ చేయబడింది