ఎస్సీ వసతి గృహాలకు ‘ కరోనా రక్షణ సామగ్రి…
రూ . 35 , 971 లక్షలు విడుదల
ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి పరీక్ష ! లకు సన్నదమవుతున్న విద్యార్థులకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ కొన్ని చర్యలు చేపట్టింది. దీని కోసం ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా అత్యవసర నిధి నుంచి రూ. 35 , 971 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో వసతి గృహాల్లోని 9 , 760 మంది విద్యార్థులకు పరీక్షకు ప్రయాణ సమయాల్లో ధరించేందుకు ఒక్కొక్కరికి 11 మాస్కులు , ఒక సబ్బు, రెండు చేతిరుమాళ్లు అందించనున్నారు . అలాగే వసతి గృహానికి పారిశుద్ధ్య సామగ్రి, శానిటైజర్లు తదితరాలు కొనుగోలు చేయాలని జిల్లా అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించారు .