జాయింట్ పట్టా అంటే ఏమిటి? ఎవరికి ఏ సందర్భంలో ఇస్తారు?
ఒక గ్రామంలో హిందూ జాయింట్ కుటుంబానికి వీరి అన్ని భూములకు కలిపి ఒకే పట్టా కలిగి ఉన్నట్లైతే అటువంటి దానిని జాయింట్ పట్టాల విభజన చేయవలసి ఉన్న అన్ని కేసులు హిందూ ఉమ్మడి కుటుంబం కలిగి ఉన్న జాయింట్ పట్టాలను ఆ కుటుంబం రాతపూర్వకంగా విభజనను కోరితే తప్ప విభజించకూడదు. ఆర్వోఆర్ చట్టం కింద హిందూ అవిభక్త కుటుంబ యజమానికి ఆ కుటుంబానికి చెందిన భూమికి మాత్రమే జాయింట్ పట్టాఇవ్వవచ్చు. మిగిలిన ఏ సందర్భంలోనూ జాయింట్ పట్టా ఇవ్వడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల రికార్డు మరియు పట్టాదారు పాసు పుస్తకల చట్టం 1971 సెక్షన్ 3(iii)(a), (b), (c)