జాగీర్లు అంటే . . .

April 16, 2020

జాగీర్లు అంటే . . .

జాగీరు పదం స‌ జై- గిర్’ అనే పర్షియా పదాల నుంచి వచ్చింది. వీటికి అర్థం’ అధీనంలో ఉంచుకొన్న ప్రాంతం’. రాజుకు ప్రత్యేకంగా సేవ చేయడానికి | లేదా ఆ వ్యక్తి గౌరవాన్ని, స్థాయిని నిలబెట్టడానికి ఉచితంగా దానం చేసిన గ్రామాలనే’ జాగీర్ ‘ అంటారు . నిజాం రాజు తనకు పరిపాలనలో సహకరించిన ముస్లిం , హిందూ పెద్ద మనుషులను సైనిక జనరల్స్ , రెవెన్యూ , ఆర్థికశాఖల నిర్వాహకులుగా నియమించి వారి అవసరాల కోసం లేదా ఖర్చుల కోసం భూమిశిస్తును వసూలు చేసుకునే అధికారంతో జాగీర్లను కేటాయించారు . వారసత్వ అధికారంతో జాగీరు భూమిలో భూమి శిస్తును వసూలు చేసుకుని అనుభవించే అధికారం మాత్రమే వారికి ఉంది . కాని కొందరు జాగీరుదార్లు ఆయా గ్రామాల్లోని అబ్కారీ , అటవీ , మత్స్యశాఖలపై అధికారం చెలాయించడంతో పాటు పోలీసు , న్యాయ పరిపాలన కూడా నిర్వహించేవారు . వివిధ రూపాల్లో ఇలా ఇచ్చిన జాగీర్లు హైదరాబాద్ రాజ్యంలో 6 , 535 గ్రామాలు గానూ , 40 , 000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో మొత్తం భూమిలో 30 . 9 శాతం ఉండేవి . హైదరాబాద్ లో మొదటి జాగీరును 1726లో నిజాం ఉల్ ముల్క్ ఇవ్వగా , చివరి జాగీరును మీర్ మహబూబ్ అలీఖాన్ ( 1869 – 1911 ) కాలంలో ఇచ్చారు . 1922 నాటికి జాగీర్ల సంఖ్య 1167 కాగా , 1949 నాటికి 1500కు చేరుకుంది . పైగా జాగీర్లు , అల్ తమా జాగీర్ , జాట్ – జాగీర్ , తనఖా – జాగీర్ , మదద్ మష్ జాగీర్ వంటివి ఉన్నాయి .