టైటిల్ గ్యారంటీ వ్యవస్థతో లాభాలేంటి ? దీనివల్ల భూ యజమానులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ?

April 15, 2020

టైటిల్ గ్యారంటీ వ్యవస్థతో లాభాలేంటి ? దీనివల్ల భూ యజమానులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ?

పకడ్భందీ యాజమాన్య హక్కులు ఉండటం వలన . .

1. యాజమాన్యాన్ని నిరూపించుకునేందుకు ప్రాధమిక సాక్ష్యం.

2. భూ సమస్యలు , వివాదాలు , అక్రమణలు , కబ్దాల నివారణ.

3. అస్తి లావాదేవీల కోసం వెచ్చించాల్సిన ధరలు తగ్గడం .

4. భూసేకరణ , భూపరిపాలనలో ప్రభుత్వానికి ఉపయోగకరం .

5. పటిష్టమైన పట్టణాభివృద్ధి , ప్రణాళికకు దోహదం .

6. అనలైన భూయాజమానులు , రైతులకు రుణాలు , నబ్సిడీ , ఇతర ప్రోత్సాహకాలు పారదర్శకంగా అందుతాయి .

7. భూముల క్రయవిక్రయాలు , లీజులకు సంబంధించిన లావాదేవీలు పెరుగుతాయి .

8. కెడస్ట్ర‌ల్‌ నర్వే , టైటిలింగు సంబంధించిన పనిలో భాగంగా గ్రామీణ , పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యావంతులైన యువతకు , తక్కువగా చదువుకున్న యువతకు ఉపాధి దొరుకుతుంది .

9 . ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో భారత్ స్థానం మెరుగయ్యేందుకు దోహదం .