మండల స్థాయిలో రెవెన్యూ శాఖ విధులు….

April 16, 2020

మండల స్థాయిలో రెవెన్యూ శాఖ విధులు…

సర్టిఫికెట్ల మంజూరు

సర్టిఫికెట్ల మంజూరు ప్రస్తుతం మండల స్థాయిలో రెవెన్యూ శాఖకు’ రోజువారీ కార్యక్రమంగా మారింది. తహశీల్దార్లు ఈ సర్టిఫికెట్లను మంజూరు చేస్తారు. 1. కుల , నివాన, నేటివిటీ, వాల్యుయేషన్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు , కేంద్ర ప్రభుత్వం కోసం జారీ చేసే సర్టిఫికెట్లు, ఆదాయ, జనన, మరణ సర్టిఫికెట్లు, అవివాహ, డిపెండెంట్, ఓబీసీ, ఈబీసీ సర్టిఫికెట్లు , బాణాసంచా దుకాణాలకు పర్మిషన్, పేలుడు వదార్థాలు నిల్వ ఉంచేందుకు ఎ ఓనీ ఇవ్వడం .

పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు

రైతుల కోసం రెవెన్యూ శాఖ పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం ముఖ్యమైన విధుల్లో ఒకటి . భూమిపై హక్కును నిరూపించుకునేందుకు పాసు పుస్తకాలు కీలకమైన ఆధారాలు . రాష్ట్రంలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నందున వారు వ్యవసాయం కోసం బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా ఇవే కీలకం. రైతుకు సంబంధించిన భూమి వివరాలన్నింటితో తహశీల్దార్ పాసు పుస్తకాలు మంజూరు చేయడం ద్వారా రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు .

ప్రకృతి విపత్తులు

రాష్ట్రంలో వరదలు లేదా కరువు వంటి ప్రకృతి వివత్తులు సంభవించినప్పుడు వాటి ద్వారా జరిగే నష్టనివారణకు రెవెన్యూ శాఖ కీలకంగా పనిచేస్తోంది . కరువు సంభవించినప్పుడు కరువు ప్రభావిత మండలాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడం . ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు రోడ్లు , వ్రజోవయోగ నిర్మాణాలు , ఇతర ఉపాధి మార్గాలను కల్పించేందుకు రెవెన్యూ శాఖ కృషి చేస్తోంది. ఇక వరదలు వచ్చినప్పుడు వాటి స్థాయి అంచనా వేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం , వారికి నిత్యావసర వస్తువులు అందించడం , పడవలు , గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడం ద్వారా అని , ప్రాణ నష్టాల నివారణలో రెవెన్యూ శాఖ ముఖ్య బాధ్యత. తుఫాన్లు, భూకంవం వంటి అసాధారణ వివత్తులు వచ్చినప్పుడు కూడా రెవెన్యూ శాఖ ప్రజలకు అండగా ఉంటోంది. తమ మండల వరిధిలో ఈ కార్యక్రమాల నిర్వహణ , వర్యవేక్షణను తహశీల్దారే వర్యవేక్షిస్తారు .

వ్యవసాయ అవసరాలకు అసైన్మెంట్ భూముల కేటాయింపు

రెండున్నర ఎకరాల కంటే తక్కువ తరి పొలం లేదా ఐదు ఎకరాల కంటే తక్కువ బీడు భూమి ఉన్న వారికి వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా కేటాయించడం కూడా రెవెన్యూ శాఖ విధుల్లో భాగం. ముఖ్యంగా ఎస్సీ , ఎస్టీ , బీసీ వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చి తహశీల్దార్ పూర్తి బాధ్యతతో భూములను వారికి కేటాయిస్తారు .

ప్రజోపయోగం కోసం ప్రభుత్వ భూముల కేటాయింపు

ప్రజల ఉపయోగార్థం ప్రభుత్వ స్థలాలను గుర్తించడం , వాటిపై ప్రభుత్వానికి నివేదక ఇవ్వడం తహశీల్దార్ విధుల్లో ఒకటి . ప్రజలకు ఉపయోగంగా ఉండేందుకు కో – ఆపరేటీవ్ సొసైటీలు , పరిశ్రమలు , స్థానిక సంస్థలు , ఎసీఐ , ఆర్టీసీ , టీఎఐసీ వంటి వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూములను కేటాయిస్తారు .

భూసేకరణ

ఇరిగేషన్ ప్రాజెక్టులు , కాలువలు వంటి ప్రజోపయోగార్ధ ప్రైవేటు స్థలాలను సేకరించడం తహశీల్దార్ విధి . భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ కోసం భూములను గుర్తించడం , ప్రభుత్వాలకు నివేదించడం , వారికి పరిహారం అందించడం కూడా తహశీల్దార్ బాధ్య త . ప్రభుత్వ సేవలను ప్రజలకు సులువుగా అందించడం కోసం ప్రారంభించిన మీసేవాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా రెవెన్యూ శాఖ చూస్తోంది . మీ సేవాల ద్వారా ప్రజలకు అన్నిరకాల సేవలు సత్వరం , సులువుగా అందించేందుకు తహశీల్దార్లు కృషి చేస్తారు . వారు