అట‌వీ హ‌క్కుల చ‌ట్టంలోని ముఖ్య‌మైన అంశాలు…

March 31, 2020

అట‌వీ హ‌క్కుల చ‌ట్టంలోని ముఖ్య‌మైన అంశాలు…

  • ఆ షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయక అటవీ వాసులు, అటవీ భూములు తరతరాలుగా నివసిస్తున్నా ఇప్పటివరకు నమోదుకాని వారి హక్కులను గుర్తించడం అడవిలో నివసించే షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర సాంప్రదాయ తెగల యొక్క 12 హక్కులను ఈ చట్టం గుర్తించింది. అటవీ హక్కులను సంక్రమింపజేయడానికి ఈ చట్టం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. తాము ఆ హక్కు పొందడానికి అర్హులమని రుజువు చేసుకోవడానికి వ్యక్తులకు విస్తృతమైన జాబితా ఇచ్చింది .
  • వ్యవసాయ నిమిత్తమై గానీ, గృహ నిమిత్తమై గానీ అటవీ భూమిని 13 డిసెంబర్ 2005 కంటే ముందు ఆక్రమించుకున్న వారికి హక్కు పత్రం ఇవ్వబడుతుంది. అయితే ఒక వ్యక్తికి గరిష్టంగా 4 హెక్టార్లు ( 10 ఎకరాలు ) భూమిపై మాత్రమే హక్కు లభిస్తుంది. దరఖాస్తులను పరిశీలించే కార్యక్రమాన్ని గ్రామ సభ చేపడుతుంది. ఈ దరఖాస్తులను పరీక్షించి హక్కు పత్రాలను జారీచేసే పనిని జిల్లా కమిటీలు నిర్వహిస్తాయి. దరఖాస్తు పరిశీలన పూర్తికాకముందే షెడ్యూల్డ్ తెగలవారినైనా ఇతర తెగలవారినైనా వారున్న చోటు నుంచి ఖాళీ చేయించదు. అక్కడ ఉండి వెళ్ళిపోయిన వారిని బలవంతంగానో, అన్యాయంగానో ఖాళీ చేయించినట్లయితే వారికి పునరావాసం కల్పిస్తుంది. ఈ చట్టం అటవీ స్థలాలను ప్రభుత్వం ఇతర ప్రయోజనాల కోసం ( స్కూళ్లు , హాస్పిటళ్ళు నిర్మించడానికి ) కేటాయించే సదుపాయం కలుగజేస్తుంది.
  • ఈ చట్టం క్రింద సామాజిక వర్గం యొక్క వ్యక్తుల యొక్క హక్కులు గుర్తించడం జరుగుతుంది. వ్యక్తిగత హక్కులకు, సామాజిక వర్గం హక్కులను లేదా రెండింటిని నిర్ణయించే అధికారం గ్రామసభకు ఉంటుంది. అడవులలో నివసించే ఇతరులు తమ బతుకు తెరువుకోసం మూడు తరాలుగా ( 75 సంవత్సరాలు ) ఉంటే వారికి కూడా ఈ హక్కులు పొందే అర్హత వస్తుంది. ఈ హక్కులు వారసత్వంగా బదిలీ చేయబడతాయే కానీ అమ్మకం కానీ ఈ బదిలీలు కాని చేయడానికి వీలు లేదు.