అదనపు కలెక్టర్ల విధులపై సమస్యలు….
భూ సమస్యలపై రెవెన్యూ కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల పరిష్కారంపై ఆ శాఖ వర్గాల్లో కొంత అయోమయం నెలకొంది. వారం వారం జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ) రెవెన్యూ కోర్టులను నిర్వహించాల్సి ఉంటుంది. ఇటీవల జేసీ పోస్టును ప్రభుత్వం అదనపు కలెక్టర్‌గా మార్చింది. దీంతో జేసీకి ఉండే అధికారాలు తమకు వర్తిస్తాయా లేదా అనే సందిగ్ధతతో కొందరు అదనపు కలెక్టర్లు కోర్టుల నిర్వహణ, జేసీ అధికారాల వినియోగంపై తటపటాయిస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టత కోసం ఉన్నతాధికారుల నుంచి తరచూ సలహా తీసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను నియమించి. ఒకరిని స్థానిక సంస్ధలకు కేటాయించిన విషయం తెలిసిందే. మరో అదనపు కలెక్టర్ విధులను పేర్కొనలేదు.