సాంకేతిక రంగం నుంచి సాగుబ‌డిలోకి..

March 19, 2020

సాంకేతిక రంగం నుంచి సాగుబ‌డిలోకి..

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన సుభాష్ రెడ్డికి న్యూజిలాండ్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది . సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది . కానీ అది ఎన్నో రోజులు “ లేదు . నేను న్యూజిలాండ్ వెళ్లనంటే వెళ్లనని సుభాష్ రెడ్డి కరాఖండీగా చెబితే ఆ తల్లిదండ్రులు విస్తుపోయారు . చివరికి సుభాష్ రెడ్డి చెప్పిన సమాధానానికి సంతోషపడ్డారు . సుభాష్ రెడ్డిని ఆ తల్లిదండ్రులు ఏం ప్రశ్నడిగారు . . సుభాష్ రెడ్డి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం . . .

ఎక‌రాకు ఏడాదికి రూ.9 ల‌క్ష‌ల ఆదాయం….

ఎకరాకు ఏడాదికి రూ . 9 లక్షల ఆదాయం డ్రాగన్ ఫ్రూట్ పూత వచ్చిన 45 రోజుల్లో పండు తయారవుతుంది . నాటిన ఏడాదిలోనే దిగుబడి ప్రారంభం అవుతుంది . జూన్ మాసం నుంచి పూత రావడం ప్రారంభమై మూడవ సంవత్సరంలో ఆరు టన్నుల దిగుబడి లభిస్తుంది . పిలకలను కత్తిరించి నర్స రీలో మొక్కలు పెంచి రైతు అమ్ముకోవచ్చు . టన్ను ధర రూ . లక్షా 50 వేలు ఉంటుంది . ఒక సంవ త్సరంలో వచ్చే ఆరు టన్నుల దిగుబడికి రూ . 9 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది .

మిమ్మల్ని వదిలి న్యూజిలాండ్ వెళ్లడం లేద ‘ ని చెప్పిన సుభాష్ రెడ్డిని ఆయన తల్లిదండ్రులు ‘ మరిక్కడేం చేస్తావ ‘ ని ప్రశ్నించారు . ‘ మ నకున్న ముప్పై ఎకరాల్లో వ్యవసాయం చేస్తా ‘ నని సమాధానం చెప్పారు . ఆ సమాధానాన్ని స్వాగతించిన సుభాష్ రెడ్డి తల్లిదండ్రులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి తప్పుకున్నారు . అంతే వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు . జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఈ యువరైతు పదేండ్ల కిందట సేద్యాన్ని ఆరంభించిన అందరిలాగే వరిని సాగుచే యడం మొదలుపెట్టాడు . అయితే అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు . ఆహారపంటల కంటే , ఉద్యానవన పంటలకు మంచి భవి ష్యత్తు ఉంటుందని గ్రహించాడు . ఉద్యానవనశాఖ అధికారులతో చర్చించి జామ పంటను ఎంచుకున్నాడు . సుభాష్ రెడ్డి మూడేండ్ల కిందట ఐదెకరాల విస్తీర్ణంలో ఎకరానికి నాలుగు వందల చొప్పున మొత్తం రెండు వేల జామ మొక్కలను నాటాడు . 11 నెలల్లోనే తొలి జామపంట చేతికి వచ్చింది . జామతోటను మొదట గుత్తేదారులకు అప్పగించిన సుభాష్ రెడ్డి తర్వాత తానే స్వయంగా జామ సాగు చేశాడు . నవంబర్‌లో జామ సీజన్ ముగిసిపోయింది . ఇప్పుడు మరో సీజను సుభాష్ రెడ్డి జామ తోట సిద్ధమైంది . అంతేకాదు మూడు నెలల కిందట రెండెకరాల్లో సీతాఫలం మొక్కలను కూడా నాటాడు . శాస్త్రీయ పద్ధతిలో సాగుతున్న సీతాఫలం తోట ఈ ఏడాది అక్టోబర్ వరకు కాతకు వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు సుభాష్ రెడ్డి . .