జీహెచ్ఎంసీలో కరోనా కంట్రోల్ రూమ్
కోవిడ్ – 19 వ్యాప్తిని అరికట్టేందుకు నగర పరిధిలో నియమించిన 150 బృందాల పనిని మానిటరింగ్ చేస్తూ ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సేకరించుటకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు . కంట్రోల్ రూమ్ ఇన్ చార్జిగా జీహెచ్ఎంసీ విశ్రాంత అదనపు కమిషనర్ అనురాధను నియమించారు . జీహెచ్ఎంసీ 108 వాహన సర్వీసు వైద్య ఆరోగ్య శాఖల అధికారులు మూడు షిప్టులలో అందుబాటులో ఉంటున్నారు . 24 గంటల పాటు పనిచేస్తున్న కంట్రోల్ రూమ్ విధులలో ఆయా శాఖలను ఐటీ , విభాగం డీఈ బెనర్జీ , ఏఎంహెచ్ఓ డాక్టర్ ఉమా రాణి సమన్వయం చేస్తున్నారు . మార్చి 1 నుంచి విదేశాల నుంచి నగరానికి వచ్చిన వారి జాబి తాను కంట్రోల్ రూంకు ప్రభుత్వం పంపుతున్నది. విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాను ఆయా సర్కిళ్లలో ఉన్న బృందాలకు కంట్రోల్ రూమ్ అందిస్తుంది . సదరు జాబితా ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లను వార్డు . స్థాయి బృదాలు సందర్శించి 14 రోజుల పాటు హోం క్వారంటైన్ జరిగిందా లేదా ఆ వ్యక్తితో పాటు , కుటుంబ సభ్యుల ఆరోగ్యస్థితిపై సేకరిం చిన వివరాలను కంట్రోల్ రూంకు పంపుతారు . అదే విధంగా వార్డు బృందాలు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి హోం క్వారంటైన్ స్టాంపును చేతిపై వేస్తున్నది . ఒకవేళ ఆవ్యక్తితో పాటు ఉంటున్న కుటుంబ సభ్యులకు కోవిడ్ లక్షణాలు కనిపిస్తే కంట్రోల్ రూంకు సమా చారం అందిస్తారు . అటువంటి వ్యక్తులకు వైద్య సేవలు అందించుటకు ఐసోలేషన్ కేంద్రాలు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించుటకు కంట్రోల్ రూం నుండి మోనిటరింగ్ చేస్తారు . ఇతర శాఖలతో కూడా సమన్వయం చేస్తున్నారు . అయితే కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు నేరుగా హెల్ప్ లైన్ నెంబర్ 104 సంప్రదించాలి.