కరోనా ప్రభావంతో 26 రైళ్లు రద్దు
కరోనా ( కావిడ్ 19 ) వైరస్ ప్రభావం నేపథ్యంలో రైల్వే శాఖ మరోసారి పెద్దసంఖ్యలో రైళ్లను రద్దు చేసింది . వీటిలో సికింద్రాబాదహజ్రత్ ! నిజాముద్దీన్ దురంతో ఎక్స్ ప్రెస్ , తిరుపతి జమ్ముతావి హంసఫర్ , హైదరాబాద్ పుణి ఎక్స్ ప్రెస్ , కాకినాడ లింగంపల్లి కోకనాడ ఎక్స్ ప్రెస్ తదితర 26 రైళ్లు ఉన్నాయి. ఆయా రైళ్లలో ఇప్పటికే తీసుకున్న టికెట్లను రద్దు చేసింది . ఆయా ప్రయాణికులకు టికెట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు ద మ రైల్వే తెలిపింది .