రెవెన్యూ పదాలు అర్థాలు

March 28, 2020

రెవెన్యూ పదాలు అర్థాలు

1 . ఆబాదీ / గ్రామ కంఠం : గ్రామంలో ప్రజలు నివసించుటకు ఉద్దేశించిన భూమి . గ్రామ ఉమ్మడి స్థలం .
2 . ఆబ్సెంటీ ల్యాండు లార్డు : పరోక్ష భూస్వామి . ఒక గ్రామంలో భూమి ఉండి వేరొక చోట నివశిస్తూ భూమిని సొంతంగా సాగుచేయని భూ యజమాని .
3 . ఎకరం : భూమి విస్తీర్ణమునకు కొలమానము . ఒక ఎకరం 4840 చదరపు గజ‌ములకు నమానము . 100 సెంట్లు లేదా 40 గుంటల భూమిని ఒక ఎకరం అంటారు .
4 . అడంగళ్/ ప‌హాణీ; ఒక గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదుచేసే రిజిష్టరు . ఆంధ్ర ప్రాంతంలో ‘ అడంగళ్ , తెలంగాణా ప్రాంతంలో పహాణీ అని పిలవబడే ఈ రిజిష్టరు గ్రామ లెక్క నెంబరు 3 కూడా అంటారు . ఈ రిజిస్టరులో గ్రామంలోని అన్ని భూముల వివరాలు , పట్టాదార్లు , సాగుదార్ల పేర్లు , పంటల వివరాలను ప్రతి సంవత్సరం నమోదు చేస్తారు .
5 . ఆధీనము : ఒక వ్యక్తికి భూమిపై ఉన్న హక్కు స్వాధీనానుభవం .
6 . అనాదీనము : పూర్వం నుంచి
7 . అడవర్స్ పొసెషన్ : ప్రతికూల స్వాధీనం , ప్రతికూల ఆధీనం . వాస్తవంగా భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని వాస్తవంగా శాంతియుతంగా , నిరవధికంగా , బహిరంగంగా స్వాధీనంలో ఉంచుకుని , దానిపై నియంత్రణాధికారాన్ని కలిగి ఉండటాన్ని అడ్వ‌ర్స్ పొసెషన్ అంటారు . ఈ విధంగా పట్టా భూమి 12 సంవత్సరాలు , ప్రభుత్వ భూమి 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్నట్లయితే సివిల్ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు .
8 . అగ్రహారం : బ్రాహ్మణులకు శిస్తు లేకుండాగాని. తక్కువ శిస్తుతోకాని గ్రాంటుగా ఇచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగం.
9 . ఏజన్సీ : గిరిజనులు నివశించే ప్రాంతం. గిరిజనులు నివసించే ప్రాంతాలను షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది . ప్రస్తుతం షెడ్యూల్ ప్రాంతాలుగా పిలవబడే ప్రాంతాలనే ఏజన్సీ ప్రాంతాలు అని కూడా అంటారు . ఈ ప్రాంతంలో ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం ఉంటుంది .
10 . అజమాయిషీ : నరిగా ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయుట . గ్రామ రెవెన్యూ అధికారి భూమికి సంబంధించి నిర్వహించే గ్రామ లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు . మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ , గ్రామ రెవెన్యూ అధికారి రాసిన గ్రామ లెక్కలలోని వివరాలను గ్రామంలో భూములపై తనిఖీ చేసిన భూములలో కొన్నింటిని తహశీల్దార్ లేదా డిప్యూటీ తహశీల్దారు తనిఖీ చెయ్యాలి . తనిఖీ వివరాలు గ్రామ లెక్క నెం . 3లో వ్రాస్తారు . అజమాయిషీ ప్రతి సంవత్సరం నిర్వహించాలి .
11 . ఎలియనేషన్ : భూమి ఎలియనేషన్ అంటే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం . ఎలియనేషన్ వ్యక్తులకుగాని నంస్థకు గాని , స్థానిక సంస్థలకుగాని చేయవచ్చు . ఎలియనేషన్ ఉచితంగా చేయవచ్చు లేదా కొద్దిపాటి రుసుము చెల్లింపుతో కాని చేస్తారు .
12 . అన్యాక్రాంతం : ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఇచ్చిన భూమిని ఇతరులు కొనుగోలు లేదా అక్రమణ లేదా మరే విధంగానైనా చట్ట వ్యతిరేకంగా పొందడం , గిరిజనులకు చెందిన భూములను గిరిజనేతరులు చట్ట విరుద్ధంగా పొందడం .
13 . ఆసామీ షికీ : భూ యజడూనికి పన్ను చెల్లించే నిబంధనపై భూమి కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న వ్య‌క్తి ,
14 . ఆయకట్టు : ఒక జలాభారము కింద సాగు అవుతున్న వ్యవసాయ భూమి .
15 . నీ మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించమని ఆదేశిస్తు ఇచ్చే నోటీసులు