ఇనాం భూమికి పట్టా పొందటానికి ఎలాంటి ఆధారాలు కావాలి ?
ఆంధ్రా ప్రాంతంలో ఇనాం ఫెయిర్ రిజిస్టర్ ( ఐ . ఎఫ్ . ఆర్ ) రిజిష్టర్ లో సంబంధిత వ్యక్తి పేరు ఇనాందారుగా నమోదై ఉండాలి. ఇనాం గ్రాంటు తాలుకు ఉత్తర్వులు, కౌలుదార్లయితే 7 – 1 – 1948 నాటికి వారి పేర్లు కౌలుదార్లుగా భూమి రికార్డుల్లో ఉండాలి. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఇనాం రిజిష్టరులో సంబంధిత వ్యక్తి పేరు నమోదు కాబడి ఉండాలి. ఇనాం భూమి, సంబంధిత వ్యక్తి గానీ, అతని వారసులు గానీ, తేది. 20 – 7 – 1955 నాటికి స్వాధీనానుభవంలో భూమిపై ఉండాలి.
అ ) 1954 – 55 సంవత్సరపు ఖాస్రా పహాణి నకలు
ఆ ) 1973 – 74 సంవత్సరపు పహాణి నకలు
ఇ ) ప్రస్తుత సంవత్సరపు పహాణి నకలు
ఈ ) ఇనాం భూమిని ఖరీదు చేసిన డాక్యుమెంట్లు ( వర్తిస్తే ) పై ఆధారములు పరిశీలించి ఓ . ఆర్ . సి . – జారీచేస్తారు . ఓ . ఆర్ . సి . జతపరుస్తూ 6 – ఎలో అర్జీ పెట్టుకుంటే తగు విచారణ జరిపి పట్టాదారు పాస్ ని పుస్తకం , టైటిల్ డీడ్ జారీ చేస్తారు.