అసైన్మెంట్ భూములు – తగాదాలు

March 27, 2020

అసైన్మెంట్ భూములు – తగాదాలు

భూమిలేని నిరుపేదలకు , ప్రభుత్వం కొన్ని షరతులతో సాగు చేసుకోవడానికి కాని లేదా ఇల్లు కట్టుకోవడానికి భూమి ఇస్తుంది . ఆ విధంగా భూమి ఇవ్వటాన్నే అసైన్మెంట్ అంటారు . ఆంధ్ర ప్రాంతంలో అసైన్మెంట్ చేయడానికి ప్రత్యేక చట్టం లేనప్పటికీ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ – 15 ప్రకారం , జి . ఓ . ఎం . ఎస్ . నెం . 1725 , రెవెన్యూ తేది 26 . 08 . 1959 ద్వారా భూ కేటాయింపులు చేస్తున్నారు . అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ భూముల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ ( తెలంగాణా ఏరియా ) ల్యాండ్ రెవెన్యూ చట్టం , 1317 ఫసలీలోని సెక్షన్ 53ఎ 54 , 54ఎ , 58బి , లావణి రూల్స్ 1950 ప్రకారం చేపట్టడం జరుగుతుంది . 1958లో భూమి వంపిణీకి సంబంధించి ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రాంతానికి ప్రభుత్వ భూముల మంజూరు విధానాన్ని జి . ఓ . ఎం . ఎస్ . నెం . 1406 , రెవెన్యూ తేది . 25 . 7 . 1958 జి . ఓ . ఎం . ఎస్ . నెం . 1724 రెవెన్యూ తేది 26 . 08 . 1959 ద్వారా రూపొందించారు . ఇలా ఇచ్చిన భూమిని ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు నిషేధ చట్టం , 1977 ప్రకారం వారసత్వంగా అనుభవించాల్సిందే కాని ఇతరులకు అమ్మకూడదు , దానం చేయకూడదు