కార్యనిర్వాహక మెజిస్ట్రేట్లు ఏయే సందర్భాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ?

April 16, 2020

కార్యనిర్వాహక మెజిస్ట్రేట్లు ఏయే సందర్భాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ?

ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 107 నుంచి 124 వరకు ఏయే సందర్భాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో స్పష్టం చేస్తున్నాయి. అల్లర్లు, అరాచకాలు, భయోత్పాతాల అవకాశాన్ని నిరోధించటానికి , ముందుజాగ్రత్త చర్యగా అనుమానితుల నుంచి నిర్బంధంగా మంచి నడవడికి బాండు తీసుకోటానికి మేజిస్ట్రేట్ అధికారాలను ఈ సెక్షన్లు చెబుతున్నాయి . శాంతి భద్రతల విఘాతం , వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టడం , అక్రమ వ్యాపారాలు , అశ్లీల కార్యకలాపాలు వంటి చర్యలను నిరోధించడానికి ఈ సెక్షన్లు అధికారాలు ఇచ్చాయి.