భూ ఆక్ర‌మ‌ణ‌ల నిరోధానికి ప‌టిష్ట చ‌ర్య‌లు

March 30, 2020

భూ ఆక్ర‌మ‌ణ‌ల నిరోధానికి ప‌టిష్ట చ‌ర్య‌లు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు “ యాంటీ భూమాఫియా ‘ విభాగం కింద రెవెన్యూ , పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి . దీంట్లో నమోదయ్యే కేసులను స్వయంగా ముఖ్యమంత్రి ‘ సమీకృత పరిష్కార విభాగం ( ఐఆర్ఎన్ ) ‘ వెబ్ సైట్ ద్వారా నేరుగా పర్యవేక్షిస్తారు.

* భూ ఆక్రమణ కేసులలో ( ప్రభుత్వ భూమి ) తహశీల్దారు విచారణ చేసి ఆక్రమణదారును 14 రోజుల పాటు నిర్భందించేందుకు తహశీల్దారు కార్యాలయంలోనే ప్రత్యేక జైలు ఉంటుంది. భూ ఆక్రమణను | తొలగించేందుకు, రెవెన్యూ జైలులో ఖైదీని ఉంచేందుకు అయ్యే ఖర్చును కూడా సంబంధిత వ్యకి నుంచే వసూలు చేస్తారు.

* ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటారు . ‘ యాంటీ గూండా యాక్ట్ కేసెస్ ‘ పేరుతో భూ ఆక్రమణలు చేసే వారి ఫోటోలు తహశీల్దారు కార్యాలయంలో ఫ్లెక్సీ ద్వారా ప్రదర్శిస్తారు.

* ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై తహశీల్దార్ కేసులు నమోదు చేస్తే దానిపై అప్పీలుకు వెళ్లాలంటే సెక్షన్ 115 కింద నేరుగా జిల్లా కలెక్టరు ( డీఎం ) కు అప్పీలు చేయాల్సి ఉంటుంది.

* ప్రతి శుక్రవారం జిల్లా కలెక్టరు సంబంధిత అధికారులతో భూఆక్రమణల గురించి చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తారు.

* ఈ ఎవరైనా సామాన్యులు ప్రభుత్వ భూముల | ఆక్రమణల గురించి శికాయత్ ( ఫిర్యాదు ) చేస్తే వారి పేర్లు భద్రత నిమిత్తం గోప్యంగా ఉంచుతారు. అవసరమైతే వారికి కావాల్సిన రక్షణ ఏర్పాటుచేస్తారు.

* భూ ప్రబందక్ సమితి ( ల్యాండ్ మేనేజ్ మెంట్ కమిటీ ) ప్రతి గ్రామంలో ఉంటుంది. గ్రామ ప్రధాన్ (సర్పంచ్ ) అధ్యక్షతన ఉండే ఈ సమితి ప్రభుత్వ భూమిని భూమి లేని నిరువేదలకు కేటాయించేందుకు సిఫారసు చేస్తుంది.