రెవెన్యూ పదాలు అర్థాలు
•చౌఫస్లా : పట్టాదారుకున్న భూముల వివరాలు తెలుపే రిజిష్టరు . దీనిలో భూమి వర్గీకరణ , విస్తీర్ణం పట్టాదారు పేరు వంటి వివరాలుంటాయి.
• దస్తావేజు : భూమికి సంబంధించిన కొనుగోళ్లు , అమ్మకాలు , ఇతర లావా దేవీలను తెలియజేయు షత్రము . భూమి బదలాయింపు జరిగినప్పుడు , ఈ దస్తావేజును చట్టపరంగా తప్పక రిజిస్ట్రేషను చేయించుకోవాలి .
•డైగ్లాటు : అంధ్రా ప్రాంతంలో ప్రతీ గ్రామంలో సర్వే నెటిల్మెంటు కార్యకలాపాలు పూర్తిచేసి ప్రతి గ్రామమునందలి భూముల వివరాలు నమోదు చేశారు . ఇందులో అన్ని రకాల భూముల యొక్క సర్వే నెంబర్లు వాటి విస్తీర్ణములు , అవి నర్కారా , ఇనాం భూములా , మాగాణీయా , మెట్లు భూములా , వాటి వర్గీకరణ , శిస్తు మొదలగు వివరాలుంటాయి . ఈ రిజిష్టరు ఆంగ్లంలోను , తెలుగులోను రాసారు . కావున డైగ్లాటు అంటారు . దీనినే శాశ్వత ” ఎ ” రిజిస్టరుగా పరిగణిస్తారు . ఈ రిజిష్టరు మిగిలిన గ్రామ లెక్కలన్నింటికి మూలస్తంభం వంటిది .
•డ్రైల్యాండు ( మెట్ట భూమి ) : ప్రతీ గ్రామంలో సర్వే సెటిల్మెంటు కార్యకలాపాలు పూర్తిచేసిన తరువాత పట్టా భూములను రెండు తరగతులుగా వర్గీకరించారు . ప్రభుత్వ జలాధారముల నుండి వ్యవసాయం కొరకు నీరు నరఫరా చేస్తే వాటిని పల్లం భూములుగాను, అలా నీరు సరఫరా కాకుండా సాగుచేయబడు భూములను మెట్ల భూములంటారు. వీటిలో మెట్ట పంటలు పండించవచ్చును . ఇవి చాలా వరకు వర్షాధారములు .
•ఎండార్సుమెంటు : గ్రామంలోని ప్రజలు ప్రభుత్వాధికారులకు ఏదైనా | దరఖాస్తు దాఖలు చేసుకుంటే దాని పై నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని తెలియజేయు విధానము .
•ఇనాం : ప్రభుత్వం , రాజులు , జాగీర్దార్లు , జమీందార్లు మొదలగువారు దానం లేదా గ్రాంటుగా ఇచ్చిన భూమి . సాధారణంగా గ్రామంలో వివిధ సేవలందించినందుకుగాని , ప్రతిభావంతులైన కళాకారులకు కవులు , | రచయితలు , సంగీత విద్వాంసులు , నటులు , చిత్రకారులు | మొదలగువారికి , వారి ప్రతిభాపాటవాలను గుర్తిస్తూ భూములు గ్రాంటు రూపంలో లేదా దానంగా ఇవ్వడం జరిగింది . ఈ విధంగా ఇవ్వబడిన భూములనే ఇనాం భూములంటారు .
•ఇజారా : ప్రభుత్వానికి చెందిన బంజరు భూములను వ్యవసాయమునకు గాని , నివాసముండేదానికి గాని కొంత నిర్దిష్టమైన పన్ను చెల్లించు పద్ధతిపై లీజుకిచ్చుట
• ఫసలీ : ఫసలీ అంటే ప్రతీ సంవత్సరం జులై 1వ తేదీ నుండి మరుసటి సంవత్సరం జూన్ 30వ తేదీ వరకున్న 12 నెలల కాలం . దీనిని పంటకాలమును బట్టి రూపొందించారు .