గిరిజన ప్రాంతంలో భూ పరిపాల‌న

March 12, 2020

గిరిజన ప్రాంతంలో భూ పరిపాల‌న

గిరిజనుల‌కు ఆవాసం, జీవనోపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతితో పాటు సమానత్వాల‌కు అత్యంత ప్రధానమైన, విలువైన ప్రకృతి సంపద భూమి. దాంతోనే గిరిజనుల‌ భూముల‌ను అన్యాక్రాంతం కాకుండా రక్షించడానికి స్వాతంత్య్రం రాకముందు నుంచి చట్టాలు చేయబడ్డాయి. స్వాతంత్య్రానంతరం కూడా వీటికి కొనసాగింపుగా షెడ్యూలు ప్రాంత భూ బదలాయింపు నిషేధ చట్టం 1959 ఎల్‌.టి.ఆర్‌. 1/59 చట్టం, 1/70 చట్టం ఆ తర్వాత ఈ చట్టాల‌కు సవరణ కూడా తీసుకొచ్చారు. ఈ చట్టం తెలంగాణలో 1963 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం ప్రకారం షెడ్యూలు ప్రాంతాలోని భూమితో సహా ఇతర స్థిర ఆస్తుల‌ను గిరిజనులు మాత్రమే పొందటానికి అర్హులు. గిరిజనేతరులు ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్డ్‌ ప్రాంతాలో భూమిని కాని, ఏ స్థిరాస్తిని కొనుగోలు లేదా మరి ఏ ఇతర మార్గాల‌ ద్వారా పొందటానికి వీలులేదు. కాని దానికి భిన్నంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాల‌లోని గిరిజనుల‌ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రభుత్వంచే వేయబడిని (వన్‌మాన్‌ కమిటీ) గిర్‌గ్లాని కమిటి కోనేరు రంగారావు కమిటీిలు చెప్పడం జరిగింది. దీనికంతటికి కారణం చట్టం అమలులో పర్యవేక్షణ లోపించడం ఒక ఎత్తైతే.. గిరిజనుల‌లో చట్టంపట్ల అవగాహన లేకపోవటము మరొక కారణం. ఏజెన్సి (షెడ్యూల్డ్‌) ప్రాంతాల‌లో స్థిరాస్థిని గిరిజనుల‌కు తప్ప వేరొకరికి అమ్మటానికి వీలులేదు. ఒకవేళ గిరిజల‌ను ఎవ్వరు కొనటానికి సిద్ధంగా లేకపోతే అట్టి స్థిరాస్తిని ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ విధంగా అప్పగించిన భూమిని తిరిగి భూమిలేని వారికి అసైన్‌మెంట్‌ చేయవచ్చును. కాని ఎక్కడ కూడా గిరిజనేతరుల‌ నుండి భూమిని స్వాధీనపర్చుకున్న దాఖలాలు లేవు. ఒకవేళ గిరిజల‌ను కోర్టు వరకు పోయినా కొన్ని కేసుల‌లో తప్ప ఇప్పటివరకు అన్యాక్రాంతం అయిన భూమును తిరిగి స్వాధీనపర్చుకోలేదు.