అసైన్మెంట్ భూములు వేరొక భూమి లేని నిరుపేద కొనవచ్చా ?

March 27, 2020

అసైన్మెంట్ భూములు వేరొక భూమి లేని నిరుపేద కొనవచ్చా ?

అసైన్మెంట్ భూములు పొందిన వ్యక్తి వారసత్వంగా భూమిని తమ వారసులకు బదిలీ చేయవచ్చు తప్ప మరే విధంగా ఇతరులకు అన్యాక్రాంతం చేయకూడదు . ఒకవేళ ఇతరులకి ఆ భూమిని అమ్మినా మరే విధంగా అప్పగించినా , అన్యాక్రాంతం చేసినా ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు నిషేధచట్టం , 1977 ప్రకారం చెల్లదు . ఆ భూమిని తిరిగి అసలు అసైనీకి అప్పగిస్తారు . కాని ఇటీవల చేసిన చట్ట సవరణననురంచి ఒకవేళ భూమి లేని నిరుపేదలు అసైన్ మెంట్ భూమిని కొంటే వారి నుంచి భూమిని తీసుకోకుండా వారికే అసైన్ మెంట్ పట్టా జారీచేస్తారు . ఈ చట్ట సవరణపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాజ్యం నడుస్తున్నది .