ఇనాం భూములు ఎవరివి ? ఎవరికి ?

March 24, 2020

ఇనాం భూములు ఎవరివి ? ఎవరికి ?

పూర్వం రాజులు , చక్రవర్తులు , నిజాం సర్కారు , జాగీర్దారులు లేదా సంస్థానాధీశులు తమకు అందించిన సేవలకుగాను , కొన్నిసార్లు వారి వారి అర్హతలననుసరించి , కొంత మందికి భూములను బహుమతిగా (గ్రాంటు ) ఇవ్వడం జరిగింది . ఈ విధంగా దానం పొందిన భూములు ఇనాం ములుగా రికార్డుల్లో నమోదు చేశారు . ఇనాం భూములను రద్దుచేస్తూ తెలంగాణా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ( తెలంగాణా ఏరియా ) ఇనాముల రద్దు చట్టం , 1955 ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ఏరియా ) ఇనాములు ( రద్దు రైత్వారీగా మార్చటం ) చట్టం , 1956లో చట్టాలు వచ్చాయి . ఈ చట్టాలననుసరించి ఇనాం భూములకు తెలంగాణా ప్రాంతంలో ఓ . ఆర్ . సి సర్టిఫికెట్లు , ఆంధ్రా ప్రాంతంలో రైత్వారీ పట్టాలు ఇచ్చారు . అయినా ఇప్పటికీ తెలంగాణా ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల ఇనాం భూములు సెటిల్ కాలేదని కోనేరు రంగారావు కమిటీ నివేదిక తేల్చింది .