భూమి స‌ర్వే విధానం

March 24, 2020

భూమి స‌ర్వే విధానం

భూములు సర్వే చేయడానికి , మౌళిక ( సర్వే) భూమి రికార్డులను నిర్వహించడానికి చట్టబద్ధమైన ప్రాతిపదికను 1923లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్వే సరిహద్దుల చట్టం ద్వారా వీలు కల్పించారు . 1958లో ఆంధ్రప్రదేశ్ సర్వే సరిహద్దుల ( విస్తరణ , సవరణ ) చట్టాన్ని చేయడం ద్వారా సదరు చట్టాన్ని సవరించి , తెలంగాణ ప్రాంతానికి విస్తరించారు . రెవెన్యూ పరిపాలన అర్థవంతంగా , సమర్ధవంతంగా నిర్వహించాలంటే భూమి రికార్డుల నిర్వహణతో పాటు భూమికి సంబంధించిన సర్వే సెటిల్మెంటు ప్రక్రియ కూడా చాలా అవసరం . సర్వే అంటే ఏదైనా విషయంలో కావలసిన వివరాలను కొన్ని నియమాల ప్రాతిపదికగా సేకరించడానికి జరిపే దర్యాప్తు …..

భూమికి సంబంధించి సర్వే అంటే ఆ భూమి భూస్వభావం , దానిని ఉపయోగించుకుంటున్న పద్దతిని బట్టి విభాగాలుగా చేయడం , వాటికి సర్వే నెంబర్లు ఇవ్వడం , వాటి విస్తీర్ణాన్ని హద్దులను నిర్ణయించడం , వాటి పటములు తయారు చేసే ప్రక్రియ . భూమి సర్వే రెండు రకాలుగా ఉంటుంది . ఒకటి టోపోగ్రాఫికల్ సర్వే , రెండోది కెడస్టల్ సర్వే . భూమి నైసర్గిక చిత్రాన్ని , సహజ వనరులైన నదులు , చెరువులు , కొండలు , రోడ్లు , రైలు మార్గాలతో పాటుగా సంపూర్ణంగా రూపొందించడం టోపోగ్రాఫికల్ సర్వే . దీనిని సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్వహిస్తుంది . ఇక కెడస్టల్ సర్వే అంటే ప్రతి వ్యక్తికి సంబంధించిన భూకమతం సరిహద్దులు , విస్తీర్ణం , యాజమాన్యాన్ని నిర్ధారించడం . దీనిని రాష్ట్ర సర్వే శాఖ నిర్వహిస్తుంది .

సర్వేకు సంబంధించిన కొల‌త‌ల వివ‌రాలు
1 . ఒక గొలుసు – 100 లింకులు | 20 . 12 మీటర్లు / 22 గజములు లేక 66 అడుగులు
2 . ఒక లింకు – 7 . 92 అంగుళాలు
4 . ఒక ఎకరం – 10 చదరపు గొలుసులు | 4047 చదరపు మీటర్లు / 4840 చదరపు గజములు
6 . ఒక హెక్టారు – 2 . 471 ఎకరములు

ఆంధ్ర ప్రాంతము :
7 . ఒక ఎకరం : 100 సెంట్లు / 4840 చదరపు గజములు
8 . ఒక సెంటు : 48 చదరపు గజములు

తెలంగాణ ప్రాంతము :
9 . ఒక ఎకరం – 40 గుంటలు
10 . ఒక గుంట – 121 చదరపు గజములు

రాయలసీమ ప్రాంతము :
11 . ఒక అంకణం – 100 చదరపు అడుగులు
12 . ఒక ఎకరం – 435 అంకణములు లేక 43 , 560 చదరపు అడుగులు లేక 4840 చదరపు గజములు