పెద్ద సారుది…. మంచి మనసాయె
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ వీపీ గౌతమ్ పలు పాఠశాలలను ఆకస్మకంగా తనిఖీ చేశారు. కిష్టాపురం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లగా చిన్నారులు మధ్యాహ్న బోజనం తింటున్నారు. ఆ భోజనం నాణ్యతను తెలుసుకొనేందుకు కలెక్టర్, ఐటీడీఏ పీవో హనుమంతు … ఇద్దరూ చిన్నారులతో కింద కూర్చొని భోజనం చేస్తున్న దృశ్యమిది.