క్రీడాలోకానికి కరోనా కాటు..
కరోనా దెబ్బతో క్రీడాలోకం మూగబోవడం విచారకరమని టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్‌శర్మ అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సురక్షితంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. రోహిత్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. క్రీడాలోకం స్తంభించిపోవడం విచారంగా ఉంది. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండాల్సిన అవసరముంది. వైరస్ దరిచేరక ముందే జాగ్రత్తలు పాటించాలి. పరిసరాలపై ఓ కన్నేసి ఉంది…కాస్త ఆనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తమ ప్రాణాలను లెక్కచేయకుండా..కరోనా బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కృషికి నా అభినందనలు. ట్విట్టర్ లో చివరిగా ఒక్కమాట… జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి. అని పేర్కొన్నాడు.