సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు పట్టా పొందటం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ ?

March 26, 2020

సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు పట్టా పొందటం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ ?

సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమికి హక్కు పత్రాలు పొందాలంటే పట్టా కచ్చితంగా చేయించుకోవాలి. భూమిపై హక్కుకు రుజువుగా ఉండే పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్ పొందాలంటే సాదాబైనామా విక్రయాన్ని క్రమబద్దీకరించుకుని ఫారం – 13 ( బి ) సర్టిఫికెట్ పొందాలి. బ్యాంకు రుణం కావాలన్నా, ఎరువులు, పురుగుల మందులు, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం రావాలన్నా, భూ తగాదాలు వచ్చినప్పుడు హక్కును రుజువు చేసుకోవాలన్నా పాస్ పుస్తకం,టైటిల్ డీడ్ ఉండాలి.