టైటిల్ గ్యారంటీ చ‌ట్టంపై విశ్లేష‌ణ‌…..

March 21, 2020

టైటిల్ గ్యారంటీ చ‌ట్టంపై విశ్లేష‌ణ‌…..

ప్ర‌స్తుతం దేశంలో ఉన్న భూమి రికార్డులన్నీ కూడా అవి తప్పు అని నిరూపించేంత వరకే సరియైనవి . ఒక వ్యక్తి పేరు భూరికార్డుల్లో నమోదై ఉంటే వేరే ఎవరైనా ఆ వ్యక్తి ఆ భూమి తనది అని కోర్టుల్లో నిరూపించుకోగలిగితే రికార్డులో మొదటి వ్యక్తి పేరు తొలగించి , ఆ నిరూపించుకున్న వ్యక్తి పేరు నమోదు చేయాలి . దీనినే ప్రిసమ్బిల్ భూమి రికార్డుల వ్యవస్థ అంటారు . ఆస్ట్రేలియా , అమెరికా , | బ్రిటన్ , కెనడా , సింగపూర్ , మలేషియా , స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో భూమికి యాజమాన్య హక్కుషత్రం పొందితే అదే అంతిమం . భూమిపై హక్కు నిరూపణకు ఆ ప‌త్రమే ఆధారం . భూమి హక్కుకి ఆ పత్రం పూర్తి భద్రత ఇస్తుంది . అంతేకాక భూమిపై హక్కులు కోల్పోవాల్సి వస్తే బీమా సంస్థలు డబ్బులు చెల్లిస్తాయి . ఈలాంటి ఏర్పాటును టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటారు . ఈ వ్యవస్థను మన దేశంలో కూడా తీసుకరావడానికి గత దశాబ్దకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి . 1986 సంవత్సరం నుండి ఈ అంశాన్ని వివిధ కమిటీలు చర్చించాయి . దేశంలోనే మొదటిసారిగా ఉమ్మడి ఏపీలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థను అమలుచేసే ప్రయత్నం జరిగింది . నిజామాబాద్ జిల్లాలో ‘ భూభారతి ‘ పేరుతో పైలట్ కార్యక్రమాన్ని నిర్వహించారు . | టైటిల్ గ్యారంటీ చట్టాన్ని కూడా రూపొందించే ప్రయత్నం జరిగింది . టైటిల్ గ్యారంటీ అంటే ? | టైటిల్ చట్టాలు | కేంద్ర ప్రభుత్వం 2008లో జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం ( ఎర్ఎస్ఎంవీ ) లో భాగంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు . అందుకు తగిన చర్యలు తీసుకొనడానికి వివిధ ‘ కమిటీలను ఏర్పాటుచేశారు . ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కూడా టైటిల్ గారంటీ చట్టాలను రూపొందించడానికి ప్రయత్నాలు చేశాయి . రాజస్థాన్ రాష్ట్రం ఒక ఆర్డినెన్సును జారీ చేసింది కాని అది చట్టందాల్చని కారణంగా కాలం చెల్లింది . ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదాను రూపొందించింది . ఉమ్మడి ఏపీలో కూడా ఒక ముసాయిదాను రూపొందించింది .
2016లో కేంద్రప్రభుత్వం జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమానికి ( ఎస్ఆర్ఎస్ఎంపీ ) మార్పులు చేసి డిజిటల్ ఇండియా భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని ( డీఐఎస్ఆర్ఎంపీ ) ని ప్రారంభించింది . ఈ కార్యక్రమం యొక్క అంతిమలక్ష్యం కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేయడమే . అందుకు అనుగుణంగానే పంజాబ్ రాష్ట్రంలో ఒక పైలట్ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది . ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలుచేయాలని ఆలోచన చేస్తుంది . ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం టైటిల్ సర్టిఫికేషన్ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది .