గ్రామ రెవెన్యూ లెక్కలు..
గ్రామ రెవెన్యూ అధికారిచే గ్రామ భూముల వివరాలు మొత్తం ప్రస్తుతం 9 గ్రామ లెక్కలుగా నిర్వహించబడతాయి . ఇవి మండల తహసీల్దారు , పర్యవేక్షణలో ఉంటాయి .
గ్రామ లెక్కల నంబర్ వారీగా.
1 : ప్రభుత్వ భూములు , కౌలుకు ఇవ్వబడిన భూములు , దరఖాస్తు భూములు , అన్యాక్రాంతములు , దరఖాస్తు కింద పట్టాకు ఇవ్వదగిన విస్తీర్ణం తెలియజేసే రిజిష్టర్.
2 : భూముల ఆధీనంలో మార్పులను తెలియజేసే రిజిష్టర్ .
3 : పహాణీ భూమి అనుభవము , ఆక్రమణ , సాగుబడి తెలియచేసే రిజిష్టరు
4 : భూకమతం , భూమి శిస్తు డిమాండు రిజిష్టర్
5 : డిమాండు , వసూలు విలువ తెలియజేసే లెక్క
6 : రోజువారి వసూలు తెలియజేసే లెక్క
7 : యిర్సాలనామా
8 : జలాధారాలను తెలిపే రిజిష్టర్
9 : భూమి శిస్తు చెల్లింపునకు రశీదు