ఇనాం భూములకు పట్టా ఎవరెవరికిస్తారు ?

March 30, 2020

ఇనాం భూములకు పట్టా ఎవరెవరికిస్తారు ?

ఆంధ్రా ప్రాంతంలో ఇనాందారులకు , కౌలుదార్లకు, సెక్షన్ 4 ప్రకారం శిస్తు నిర్ణయించి రైత్వారీ పట్టా జారీచేస్తారు. ఒకవేళ 7 – 1 – 1948 నాటికి కౌలుదారు అనుభవంలో ఉన్నట్లు నిర్ధారణ జరిగితే 1 / 3వ వంతు భూమిపై ఇనాందారుకు, 2 / 3వ వంతు భూమిపైన కౌలుదారుకు పట్టా మంజూరు చేయబడుతుంది. ఒకవేళ ఇనాం భూమి ఏదైనా సంస్థకు చెందినదైతే ఈ విభజన నియమం వర్తించదు. అదే తెలంగాణా ప్రాంతంలో అయితే ఇనాందార్లకు, శాశ్వత కౌలుదార్లకు, కబీజు – ఎ – కదీంలకు , రక్షిత కౌలుదారుకు కూడా పట్టా వస్తుంది .